Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇషా రెబ్బా నిజంగానే ఏడ్చేసింది: దర్శకుడు ప్రశాంత్ వర్మ

  • ఇషా రెబ్బపై ఎమోషనల్ సీన్ చేస్తున్నాను
  • సీన్ చేస్తూ ఆగిపోయిన ఆమె ఏడుస్తోంది 
  • పాత్రలో ఇన్వాల్వ్ కావడమే అందుకు కారణం             
ఇటీవల కాలంలో వచ్చిన 'అ!' చిత్రం వైవిధ్యభరితమైనదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెరపై ఈ సినిమాను ఆసక్తికరంగా ఆవిష్కరించిన దర్శకుడు ప్రశాంత వర్మ, తాజాగా ఐ డ్రీమ్స్ తో ఈ సినిమా విషయాలను పంచుకున్నాడు. "ఇషా రెబ్బ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఒక రోజున ఆమెపై ఒక సీన్ ను చిత్రీకరిస్తున్నాను. ఆ సీన్ అంతా కూడా సింగిల్ షాట్ లో తీయాలని ప్లాన్ చేశాను"

"డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో ఒకటి రెండు డైలాగ్స్ మరిచిపోయింది. రెండవసారి డైలాగ్స్ చెబుతూ మధ్యలో ఆగిపోయింది. మళ్లీ డైలాగ్ మరిచిపోయి ఉంటుందని అనుకున్నాను. కానీ ఆమె ఏడుస్తోంది .. అది ఎమోషనల్ సీన్ కావడంతో అలా ఏడుస్తోందని అనుకున్నాను. ఆమె నిజంగానే ఏడుస్తోందనే విషయం నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అప్పటికే ఆమెను నిత్యామీనన్ ఓదార్చుతోంది. నేను వెళ్లి విషయమేమిటని అడిగితే .. సీన్ లో ఇన్వాల్వ్ కావడం వలన అలా ఏడ్చేసినట్టు చెప్పింది. అందుకే సినిమాలో ఆ సీన్ చాలా రియల్ గా అనిపిస్తుంది " అని చెప్పాడు.           
eesharebba
nithya menon

More Telugu News